మా ఇంటి నుంచి 700 మీటర్ల దూరంలో లావా ఉందని తెలిసింది. మాకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు అని ఒక స్థానికురాలు వాపోయింది. భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి ఇల్లు వదిలి తప్పించుకొని వచ్చిందామె. పోలీసులు తమకు మూడు నిమిషాల సమయం ఇచ్చారని, అంతా చాలా వేగంగా జరిగిపోయిందని ఆమె బాధపడుతోంది.