ఇలా విక్రయించే ముఠాను పట్టుకున్న నరసరావుపేట పోలీసులు వారి నుంచి ఏడు కోట్ల రూపాయల విలువ చేసే 8.25 కేజీల అంబర్ గ్రీస్ స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు బైకులు,ఎనిమిది సెల్ ఫోన్ లు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.