'పరిమితమైన సీమాంతర దాడి'కి తమకు అనుమతించాలని కొందరు డిమాండ్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా 778 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి నిత్యమూ ఎక్కడో ఒకచోట పాక్ కాల్పులకు దిగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యురిలో పాక్ ఉగ్రవాదులు చేసిన పిరికిపంద చర్యకు సంబంధించిన చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చేసిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. తాజాగా పాక్ టెర్రరిస్టులు పిరికిపందలుగా వ్యవహరించారని తెలిసింది. ఈ దాడి కోసం ఉగ్రవాదులు ఉపయోగించిన ఐకామ్ అనే హ్యాండ్‌సెట్ కూడా పాకిస్థాన్‌కు చెందిన కంపెనీదేనని స్పష్టమైంది. ఇంకా జవాన్ల టెంట్‌లో మంటలు రాగానే కొందరు సైనికులు పక్కనే ఉన్న ఆఫీసర్స్ మెస్‌లోకి, స్టోర్ రూమ్‌లోకి వెళ్లారని తెలిసింది. ఉగ్రవాదులు మన సైనికులు ఉన్న మెస్‌కు, స్టోర్ రూమ్‌కు లాక్ చేశారని తేలింది.
దీంతో సైనికులు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ముష్కరులు వారిపై తూటాలతో దాడి చేయడంతో కొద్దిసేపటికే జవాన్లు ప్రాణాలు విడిచారు. అయితే ఇదంతా ఉగ్రవాదులు అప్పటికప్పుడు అనుకుని చేసిన పని కాదని, ముందు నుంచే ఈ ప్రాంతంలో పాగా వేసుండొచ్చని ఎన్‌ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది.