ఓ మహిళా లైంగిక వేధింపుతో బ్లాక్ మెయిల్ చేయడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడైనా మహిళపై వేధింపులు జరుగుతున్నాయని వినుంటాం. కానీ ఇక్కడేమో మహిళే ఓ వ్యక్తిని శృంగారం చేయమాంటూ వేధించింది. ఈ ఘటన మహారాష్ట్రాలోని పర్భని జిలాల్లో చోటుచేసుకుంది. అ వ్యక్తి పేరు సచిన్ మిట్కరి. ఇతను ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.
అదే ఆసుపత్రిలోనే ఆ మహిళ కూడా పనిచేస్తుంది. ప్రతిరోజూ శృంగారం చేయమని హింసిస్తుందని.. అతను ఒప్పుకోలేదని క్రిమినల్ కేసు పెడతానని భయపెట్టింది. అంతేకాదు.. తనకు పెళ్లయిందని చెప్పినా కూడా అతనిని వదలకుండా రోజూ వేధిస్తుండేదని.. సచిన్ ఒక లేఖలో ఈ విషయాలన్నింటిని రాసి తన ఇంట్లోనే సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.