ఈ చర్య ద్వారా ప్రజారోగ్యాన్ని తమ ప్రభుత్వం కాపాడుతుంది. పొగాకు రహిత తరాన్ని ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త నిబంధన ప్రకారం, జనవరి 1, 2007న లేదా ఆ తర్వాత జన్మించిన వ్యక్తులు మాల్దీవులలో పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడం, ఉపయోగించడం లేదా విక్రయించడం నిషేధించబడిందని తెలిపింది. ఈ నిషేధం అన్ని రకాల పొగాకులకు వర్తిస్తుంది. రిటైలర్లు అమ్మకానికి ముందు వయస్సును ధృవీకరించాలని షరతు పెట్టింది.
ఈ చర్య భూమధ్యరేఖ వెంబడి దాదాపు 800 కిలోమీటర్లు విస్తరించి ఉన్న 1,191 చిన్న దీవులతో కూడిన మాల్దీవుల దేశానికి వచ్చే సందర్శకులకు కూడా వర్తిస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వ్యక్తులకు వర్తించే ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వేపింగ్ ఉత్పత్తుల దిగుమతి, అమ్మకం, పంపిణీ, స్వాధీనం, వాడకంపై సమగ్ర నిషేధాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.