పెళ్లై కొంతకాలం వీరి జీవితం సాఫీగా సాగింది. ఆ తరువాత ఆమె చనిపోవడంతో.. ఆ ఆస్తి అంతా ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తికి దక్కింది. అయితే, సదరు వృద్ధురాలి కుటుంబ సభ్యులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అతనిపై రివర్స్ కేసు పెట్టారు.
అయితే, సదరు వ్యక్తి జోన్ బ్లాస్‌ను మోసపూరితంగా వివాహం చేసుకున్నాడని రుజువు చేయడానికి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ మహిళ కుమారుడు, కుమార్తె అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. మహిళకు చెందిన రూ. 2 కోట్ల విలువైన ఆస్తులు ఆమె భర్త పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి.