ప్రియురాలి హత్య కేసు.. 40 ఏళ్లు జైలు శిక్ష.. అయినా.. రూ.12కోట్లిచ్చారు.. ఎందుకు?
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (12:28 IST)
40 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన వ్యక్తికి జైలు అధికారులు రూ.12 కోట్లు ఇచ్చారు. ఇది కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఇంతకీ జైలుకెళ్లిన వ్యక్తికి అంతమొత్తం ఎందుకిచ్చారంటే..? 1980లో క్రైగ్ రిచర్డ్ కొలె తన మాజీ ప్రియురాలి హత్య కేసులో అరెస్టయ్యాడు.
తన మాజీ ప్రియురాలు డొనాల్డ్ రోండా విచ్ట్ (24), ఆమె నాలుగేళ్లబాబు డొనాల్డ్ 1978 నవంబర్ 11న కాలిఫోర్నియన్ అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురయ్యారు. వీళ్లను రిచర్డ్ హత్య చేశాడనే అభియోగం వుంది.
అయితే 40 జైళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత రిచర్డ్ హంతకుడు కాడని తేలింది. ఈ హత్యలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో వెల్లడైంది. సరిగ్గా 40 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన రిచర్డ్.. 31వ ఏట జైలుకెళ్లి.. 70వ ఏట విడుదలైయ్యాడు.
ఇన్నేళ్ల పాటు తప్పుడు కేసులో జైలు శిక్ష అనుభవించినందుకు రిచర్డ్‌కు పరిహారంగా 1,958,740 డాలర్లను ఫిబ్రవరి 15న కాలిఫోర్నియా విక్టిమ్స్ కాంపన్సేటివ్ బోర్డు పేర్కొంది.