ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి ఆందోళనకర రీతిలో పెరిగిపోతోంది. ఐరోపాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న వేళ అనేక దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ పరిస్థితి వస్తోంది.
కొద్దిరోజుల్లో ఐరోపా వ్యాప్తంగా కేసులు వేగంగా పెరిగిపోతాయన్న వైద్యుల హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వాలు ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఫ్రాన్స్‌లో వ్యాపారులు మరో నెలరోజులపాటు కార్యకలాపాలు నిలిపివేసేందుకు నిర్ణయించారు.
స్పెయిన్‌లో పలు స్థానిక ప్రభుత్వాలు కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిషేధించాయి. రానున్న రోజుల్లో లండన్‌లో రోజుకు 96 వేలకుపైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది.