ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న మంకీపాక్స్ వైరస్ ఇపుడు మరికొన్ని దేశాలకు వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ దేశాల్లో వెలుగు చూసింది. తొలికేసు నమోదైనట్లు ఆయా దేశాల ఆరోగ్యశాఖలు ప్రకటించాయి.
ఇతర దేశాల నుంచి తిరిగొస్తున్న వారిలో జ్వరం, చిన్న చిన్న గాయాల వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. మంకీపాక్స్‌గా అనుమానిస్తున్న ఇతర కేసుల్ని కూడా పరీక్షిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇంకోవైపు, స్విట్జర్లాండ్‌లో బాధితుడి కాంటాక్ట్‌లోకి వచ్చిన వ్యక్తులందరినీ పరీక్షిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. మధ్యప్రాచ్య దేశాల్లో ఇజ్రాయెల్‌లోనే తొలికేసు నమోదైంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80 కేసుల్ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
కాగా, ఇప్పటికే బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, అమెరికా, స్వీడన్, కెనడా, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియాలోనూ కొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో చాలా మంది ఇటీవల ఆఫ్రికాకు ప్రయాణించిన దాఖలాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.