కరోనాకు తర్వాత కరోనా వేరియంట్, ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు ప్రమాదకారిగా మారాయి. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు మంకీపాక్స్ వైరస్ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ను నివాపించేందుకు టీకాలు ఏయే దేశాల వద్ద వున్నాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే 20 దేశాల్లో మంకీ పాక్స్ కేసులు బయటపడ్డాయి.
ఆఫ్రికా నుంచి అమెరికా , ఆస్ట్రేలియా వంటి దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్.. భారత్లోకి అడుగుపెట్టలేదు. అయినప్పటికీ భారత్లో పర్యాటక సీజన్ మొదలైన కారణంగా మంకీపాక్స్ వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా వుండాలని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది.