స‌దా మీ ప్రేమ‌కు బానిస అంటున్న ఎన్‌టిఆర్‌. జూనియ‌ర్‌

శనివారం, 28 మే 2022 (11:11 IST)
Jr. Ntr post
త‌న తాత నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త జ‌యంతి సంద‌ర్భంగా మే 28, శ‌నివారంనాడు జూ.ఎన్‌.టి.ఆర్‌. సదా మిమ్మల్ని స్మరించుకుంటూ…స‌దా మీ ప్రేమ‌కు బానిస అంటూ సంత‌కంతో కూడిన పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. కొంచెం భాదేద్వేగానికి కూడా గుర‌య్యారు. 
 
ఒక్క తెలుగు సినిమా కోసమే కాకుండా తెలుగు ప్రజానీకం కోసం చలించి ప్రజా క్షేత్రంలోకి వచ్చి ఏపీ రాజకీయాల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చి తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడ్డారు. అందుకే ట్విట్ట‌ర్‌లో ఇలా పేర్కొన్నాడు.  “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనస్సుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత.. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ ఎన్టీఆర్  భావోద్వేగంతో పోస్ట్ చేయగా ఆయ‌న అభిమానులు కూడా ఎమోష‌న‌ల్ అయ్యేలా పోస్ట్‌లు పెట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు