ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ!

బుధవారం, 11 మే 2016 (15:50 IST)
సాధారణంగా ఇంట్లో ఒక చిన్నారి ఆలనాపాలనా చూసుకోవడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చెందిన టుస్సీ అనే మ‌హిళ ఏకంగా ఐదుగురు చిన్నారులకు జన్మనిచ్చి వారి ఆల‌నాపాల‌నా చూసుకుంటోంది. ఐదుగురిని చూసుకోవడం కష్టమైన కూడా టుస్సీకు త‌ప్ప‌డం లేదు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే ఈ యేడాది జనవ‌రిలో టుస్సీ ఐదుమంది చిట్టి చిన్నారులకు జ‌న్మ‌నిచ్చింది. అందులో న‌లుగురు ఆడ‌పిల్ల‌లు, ఒకరు మ‌గ‌శిశువు. ఐదు చిన్నారులతో కలిసి టుస్సీ మొదటిసారి దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
దీంతో ఈ చిన్నారులకు నెటిజ‌న్ల నుంచి బోలెడు లైక్‌లు వచ్చి పడుతున్నాయి.  ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరు అందరికీ తెగ ముద్దొచ్చేస్తున్నారు. అందుకే నెటిజన్లు ఆ తల్లిని 'టుస్సీ తుస్సీ గ్రేట్ హో!' అని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి