ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహాలను కొందరు అమెరికాలోని పలు ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేశారు. న్యూయార్క్ నగర పార్కులో ఏర్పాటు చేసిన ట్రంప్ నగ్న విగ్రహం అటువైపుగా వెళ్లేవారిని ఆకర్షిస్తోంది. ఈ వింత విగ్రహాలను చూసేందుకు జనం అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. కొంత మంది ఆ విగ్రహాలను చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు.
ఇదిలావుంటే మియామీలో ట్రంప్ వ్యతిరేకులు వైన్వుడ్లో ఏర్పాటు చేసిన ఆయన నగ్న విగ్రహాన్ని గురువారం గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్టు మియామీ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొందరు వ్యక్తులు ట్రంప్ విగ్రహాన్ని ఓ ట్రక్కులో ఎక్కిస్తుండగా తాము చూసినట్టు కొందరు సెక్యూరిటీ గార్డులు పోలీసులకు వెల్లడించారు. ట్రక్కు నంబరు ప్లేటును గుర్తించిన పోలీసులు ఆ ట్రక్కు యజమాని గురించి విచారణ చేపడుతున్నారు.