ఈ అద్భుతమైన 3 నిమిషాల ఆడియో, వీడియోను నాసా శుక్రవారం రిలీజ్ చేసింది. ఏప్రిల్ 30వ తేదీన నాలుగోసారి విజయవంతంగా మార్స్‌పై ఎగిరిన హెలికాప్టర్ వీడియో ఇది. జెజెరో క్రేటర్‌లో ఈ అధ్బుతం ఆవిష్కృతమైంది. నిమిషానికి 2400 సార్లు హెలికాప్టర్ బ్లేడ్లు తిరిగాయి.
మొత్తం 262 మీటర్ల దూరం ఇది ప్రయాణించి మళ్లీ కిందికి దిగింది. అది రోవర్ నుంచి దూరంగా వెళ్లినప్పుడు సౌండ్ తగ్గడం, దగ్గరగా రాగానే పెరగడం వీడియోలో గమనించవచ్చు. మార్స్ వాతావరణం మన భూవాతావరణ సాంద్రతలో కేవలం ఒక శాతం మాత్రమే ఉంటుంది. దీంతో అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.