12 ఏళ్లు దాటిన రోగులకు అలెర్జిక్‌ రినిటిస్‌ చికిత్స: యూరోప్‌లో అనుమతులు పొందిన గ్లెన్‌మార్క్‌ రియాలీట్రస్‌ నాజల్‌ స్ప్రే

సోమవారం, 26 ఏప్రియల్ 2021 (22:48 IST)
పరిశోధనాధారిత, అంతర్జాతీయ సమగ్రమైన ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌, యూరోపియన్‌ యూనియన్‌లోని 17 దేశాలలో తమ వినూత్నమైన నాజల్‌ స్ర్పేను ఆవిష్కరించేందుకు తమ మార్కెటింగ్‌ దరఖాస్తు అనుమతి ప్రక్రియ యొక్క చివరి, జాతీయ దశను ముగించింది. రియాలీట్రస్‌ (ఓటోపలడిన్‌ హైడ్రోక్లోరైడ్‌ 665 ఎంసీజీ అండ్‌ మోమోటసోన్‌ ఫ్యురేట్‌ 25ఎంసీజీ) త్వరలోనే ఆస్ట్రియా, బెల్జియం, చెక్‌ రిపబ్లిక్‌, జర్మనీ, డెన్మార్క్‌, స్పెయిన్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, ఐర్లండ్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, నార్వే, పోలాండ్‌, రొమానియా, స్లోవేకియా, స్వీడన్‌, యుకెలలో లభించనుంది.
 
ఎంపిక చేసుకున్న మార్కెట్‌లలో తమ సొంతంగా రిమాలీట్రస్‌ను గ్లెన్‌మార్క్‌ వాణిజ్యీకరించనుంది. ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, బాల్కన్‌ ప్రాంతం లాంటి దేశాలలో మెనారిని గ్రూప్‌ ఈ వాణిజ్య ప్రయత్నాలను గ్లెన్‌మార్క్‌తో 2020లో చేసుకున్న ప్రత్యేకమైన లైసెన్స్‌ ఒప్పందం ద్వారా  చేయనుంది.

ఈ ఒప్పంద నియమాలకు అనుగుణంగా, గ్లెన్‌మార్క్‌ ఇప్పుడు ఈ మార్కెట్‌లలో నియంత్రణ సంస్థల అనుమతులు పొందడంతో పాటుగా స్థిరంగా తమ ఉత్పత్తి అభివృద్ధినీ చేయనుంది. అదే సమయంలో మెనారిని గ్రూప్‌ శాస్త్రీయ సమాచారం అందించడంతో పాటుగా రియాలీట్రస్‌ వాణిజ్యీకరణను నియంత్రణ సంస్థల అనుమతులను అనుసరించి చేస్తుంది. గ్లెన్‌మార్క్‌ ఇప్పటికే ముందస్తు చెల్లింపులను అందుకోవడంతో పాటుగా అదనంగా రియాలీట్రస్‌ అమ్మకాల కోసం ఆవిష్కరణ, అమ్మకపు ఆధారిత మైలురాయి చెల్లింపులను సైతం అందుకుంది.
 
గ్లెన్‌మార్క్‌ అభివృద్ధి చేసిన రియాలీట్రస్‌, నాసికారంధ్రం ద్వారా వేసే స్టెరాయిడ్‌ మరియు యాంటీ హిస్టమిన్‌ యొక్క నాజల్‌ స్ర్పే సమ్మేళనపు  స్థిర మోతాదు. అలెర్జిక్‌ రినిటిస్‌(ఏఆర్‌)తో సంబంధమున్న లక్షణాలు కలిగిన 12 సంవత్సరాలు దాటిన రోగులకు చికిత్సనందించడం కోసం దీనిని అందిస్తారు. ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, నాసికా రంధ్రంలో దురద,  తుమ్ములు, అలాగే దురద, కళ్లు ఎర్రబారడం, కళ్ల నుంచి నీరు కారడం వంటి అలెర్జిక్‌ రినిటీస్‌ లక్షణాల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది.
 
అచిన్‌ గుప్తా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, బిజినెస్‌ హెడ్‌- ఈఎంఈఏ (యూరోప్‌, మిడిల్‌ఈస్ట్‌, ఆఫ్రికా, లాతమ్‌), గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ మాట్లాడుతూ, ‘‘అలెర్జిక్‌ రినిటీస్‌ కోసం చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, గ్లెన్‌మార్క్‌ ఇప్పుడు రియాలీట్రస్‌ను ఆవిష్కరించడం పట్ల ఆనందంగా ఉంది. యూరోప్‌ వ్యాప్తంగా రోగుల కోసం అందుబాటులో ఉన్న మొట్టమొదటి ఇన్‌హేలర్‌ చికిత్సావకాశం ఇది. యూరోప్‌లో దాదాపు 25% మంది ప్రజలు అలెర్జిక్‌ రినిటీస్‌ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల, రియాలీట్రస్‌ కొన్ని అసలైన ప్రయోజనాలను, అతి సులభమైన ఇన్‌హేలర్‌, వేగవంతమైన మరియు ప్రభావవంతమైన ఉపశమనం అందించగలదని భావిస్తున్నాం’’ అని అన్నారు.
 
యుఎస్‌లో రియాలీట్రస్‌ వాణిజ్యపరమైన అమ్మకాల కోసం హిక్మా ఫార్మాస్యూటికల్స్‌ పీఎల్‌సీ మరియు కెనడాలో అమ్మకాల కోసం బౌష్‌ హెల్త్‌తో గ్లెన్‌మార్క్‌ భాగస్వామ్యం చేసుకుంది. రియాలీట్రస్‌ అమ్మకాలు ఇప్పటికే ఆస్ట్రేలియాలో కొనసాగుతున్నాయి. 2020లో సీక్విరస్‌ పీటీవై లిమిటెడ్‌తో భాగస్వామ్యం చేసుకుని అక్కడ విజయవంతంగా ఆవిష్కరించింది. రియాలీట్రస్‌ను ఇటీవలనే దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్‌, ఉజ్బెకిస్తాన్‌లలో ఆవిష్కరించారు.
 
ఇప్పటి వరకూ, గ్లెన్‌మార్క్‌ రియాలీట్రస్‌ కోసం ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, కాంబోడియా, ఉక్రెయిన్‌, ఉజ్బెకిస్తాన్‌, నమీబియా, రష్యా, దక్షిణాఫ్రికా, ఈక్వెడార్‌లలో అనుమతులు పొందింది. రియాలీ్ట్రస్‌ ప్రస్తుతం కెనడా, బ్రెజిల్‌, మలేషియా, సౌదీ అరేబియా మరియు పలు ఇతర మార్కెట్‌లలో నియంత్రణ సంస్థల అనుమతుల కోసం సమీక్షలో ఉంది. చైనాలో గ్లెన్‌మార్క్‌ భాగస్వామి గ్రాండ్‌ ఫార్మాస్యూటికల్‌ (చైనా) కో లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండ్‌ను ప్రవేశపెట్టడానికి ప్రణాళిక చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు