తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై షరీఫ్ మాట్లాడుతూ.. అందరూ తన కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకున్నారని, ఆమాట కొస్తే పాకిస్థానీయులందరూ నిజాయతీపరులా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో ఉన్నవారందరూ నిజాయతీగా జీవిస్తున్నారా? అని ప్రశ్నించి కలకలం రేపారు. ఇక్కడ డబ్బు తీసుకున్నా సమస్యే, తీసుకోకున్నా సమస్యేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేసివుంటే నిర్భయంగా ఒప్పుకుంటానని తేల్చి చెప్పారు.