ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్థాన్ విఫలమైందని గతవారం పాకిస్థాన్‌పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఆ దేశానికి భద్రతా సాయం కింద అందిస్తున్న 2 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ నేఫథ్యంలో అమెరికా తీరుపై స్పందించిన లుకాంగ్.. చీటికిమాటికి పాకిస్థాన్‌ను వేలెత్తి చూపడాన్ని మానుకోవాలని సూచించారు. ఇలాంటి చర్యలను చైనా ఎంతమాత్రమూ అంగీకరించబోదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో ఒకరినొకరు వేలెత్తి చూపుకోవడాన్ని పక్కనబెట్టి.. పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.