పాక్‌లో మతగురువు హత్య.. భారత్ హస్తముందన్న ఇమ్రాన్

ఆదివారం, 11 అక్టోబరు 2020 (17:10 IST)
పాకిస్థాన్ ఓ మత గురువుకు హత్యకు గురయ్యారు. దీని వెనుక భారత్ హస్తముందని ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు గుప్పించారు. ఆ దేశ ఓడ రేవు పట్టణమైన కరాచీ నగరంలో మౌలానా అదిల్ ఖాన్ అనే మతగురువును ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. 
 
ద్విచక్రవాహనంపై వచ్చిన కొందరు దుండగులు ఆయనను అతి సమీపం నుంచి తుపాకులతో కాల్చారు. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ లో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. సున్నీలు, షియాల మధ్య విద్వేషం రగిల్చేందుకు జరిగిన కుట్రగా పేర్కొంటున్నారు.
 
ఈ హత్యపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ, ఈ ఘటన వెనుక ఉన్నది భారత్ అని, దేశవ్యాప్తంగా మతపరమైన అలజడులు రేపేందుకు భారత్ చేసిన ప్రయత్నంగా ఆరోపించారు. అయితే భారతే ఈ దాడికి సూత్రధారి అనేందుకు తగిన ఆధారాలు మాత్రం వెల్లడించలేదు.
 
మరోవైపు మత గురువు హత్యపై కరాచీ పోలీస్ చీఫ్ గులాబ్ నబీ మెమన్ స్పందిస్తూ, ఈ దాడిలో మౌలానా అదిల్ ఖాన్‌తో పాటు ఆయన డ్రైవర్ కూడా మరణించారని వెల్లడించారు. ఓ షాపింగ్ ఏరియాలో తన వాహనాన్ని నిలపగా, కొందరు సాయుధులు కాల్పులకు తెగబడ్డారని వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు