అత్యాచారాలకు పాల్పడితే వృషణాలను తొలగించండి... ఇమ్రాన్ ఖాన్

మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (11:26 IST)
అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కోరారు. ముఖ్యంగా, రేపిస్టులపై ఫస్ట్ డిగ్రీలోభాగంగా వృషణాలను తొలగించాలని ఆయన సూచించారు. 
 
ఇటవల లాహోర్‌ హైవేపై ఓ మహిళపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేశారు. తన ఇద్దరు పిల్ల‌ల‌తో క‌లిసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న మ‌‌హిళ‌ను ఇద్ద‌రు గ‌న్‌పాయింట్‌లో బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘ‌ట‌న పాకిస్థాన్‌లో పెను సంచ‌ల‌నం రేపింది. నిందితుల‌కు క‌ఠిన శిక్ష వేయాల‌ని డిమాండ్ వ‌చ్చింది. 
 
దీంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. అత్యాచార కేసులో దోషిగా తేలిన వారిని బ‌హిరంగంగా ఉరి తీయాల‌న్నారు. లేదంటే  ర‌సాయ‌నిక ప‌ద్ధ‌తిలో రేప్‌కు పాల్ప‌డిన‌వారి వృష‌ణాలు ప‌నిచేయకుండా చేయాల‌ని సూచించారు. వాస్త‌వానికి బ‌హిరంగంగా ఉరి తీయాల‌ని ఆదేశం ఉన్నా.. పాకిస్థాన్ ఆ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని, ఎందుకంటే అలా చేస్తే యూరోపియ‌న్ యూనియ‌న్ త‌మ వాణిజ్య సంబంధాల‌ను తెంచుకుంటుంద‌న్నారు. 
 
ఈ నేప‌థ్యంలో కెమిక‌ల్ క్యాస్ట్రేష‌న్ ప‌ద్ధ‌తికి తాను మెగ్గుచూపుతున్న‌ట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. హ‌త్య‌ల్లో ఫ‌స్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థార్డ్ డిగ్రీ ఉన్న‌ట్లే.. రేప్‌కు పాల్ప‌డిన వారికి ఫ‌స్ట్ డిగ్రీలో భాగంగా వారి వృష‌ణాల‌ను తొల‌గించాల‌న్న సూచ‌న చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు