అంతటితో ఆగకుండా సయీద్ నేతృత్వంలోని టెర్రరిస్టు సంస్థ జమాత్-ఉద్-దవా (జేడీయూ)పై ఉన్న ఆరోపణలను ఉపసంహరించుకుంది. తద్వారా ముంబై దాడుల సూత్రధారిని పాకిస్థాన్ కాపాడినట్లైంది. కానీ హఫీజ్‌ను భారత్, అమెరికా, ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే.. పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం సయీద్‌ను అరెస్ట్ చేసిన ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వ అధికారి సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో సయీద్ అతడి అనుచరుల విషయంలో జారీ చేసిన ఆదేశాల్లో ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలు లేవని.. అందుచేత సయీద్‌ను విడుదల చేయాలని ఆయన తరపు న్యాయవాది ఏకే డోగర్ లాహార్ హైకోర్టును ఆశ్రయించారు.