రష్మిక అభిమానులను, పరిశ్రమను అలరించే ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ పోస్టర్ తర్వాత, పరిశ్రమల నుంచి రష్మిక మందన్న కొలిగ్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి తెలుగు లుక్, పోస్టర్ను లాంచ్ చేశారు. కుబేర కో యాక్టర్ ధనుష్ తమిళ్ పోస్టర్, చావా కో యాక్టర్ విక్కీ కౌశల్ హిందీ పోస్టర్ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ మలయాళ పోస్టర్ను, శివరాజ్ కుమార్ కన్నడ పోస్టర్ను విడుదల చేశారు. రష్మిక, మైసా టీంకి శుభాకాంక్షలు తెలిపారు.
సాంప్రదాయ చీరలో, ముక్కుపుడక, ఆభరణాలతో రష్మిక ఒక గోండ్ విమెన్ గా కనిపించారు. ఆమె ఇంటెన్స్ లుక్, రక్తపు మరకలున్న రూపం, ఆమె చేతిలో గట్టిగా పట్టుకున్న వెపన్ అన్నీ ఒక పవర్ ఫుల్ మూవీ ని ప్రామిస్ చేస్తున్నాయి. టైటిల్, ఫస్ట్ లుక్ ప్రాజెక్ట్ క్యురియాసిటీ రేకెత్తించాయి.
"మైసా అనేది రెండు సంవత్సరాల కష్టం ఫలితం. కథ, ప్రపంచం, కళా దృక్పథం, పాత్రలు – ప్రతీ అంశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇప్పుడు ఈ కథను ప్రపంచానికి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం" అని దర్శకుడు రవీంద్ర పుల్లె తెలిపారు.
గత రెండు రోజులుగా సర్ ప్రైజింగ్ ఎనౌన్స్ మెంట్స్, పోస్టర్ రిలీజ్లు ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.