పాకిస్థాన్ పార్లమెంట్ ఎన్నికలు బుధవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో ముంబై పేలుళ్ల సూత్రధారి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయీద్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న హఫీజ్‌ను ప్రజలు తిరస్కరించారు. ఆయనకు మద్దతిచ్చిన అల్లాహో అక్బర్ తెహరీక్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు.
అయితే, ఆయన మద్దతుదారులమని చెప్పుకుంటూ బరిలోకి దిగిన ఇండిపెండెంట్ అభ్యర్థులు కొందరు విజయం సాధించారు. మొత్తం 272 స్థానాలకుగాను ఎన్నికలు జరుగగా, ప్రభుత్వ ఏర్పాటులో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు.
ఇకపోతే.. పాకిస్థాన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహరీక్ ఇన్సాఫ్ పార్టీ 121 స్థానాల్లో ముందంజలో ఉంది. 58 స్థానాలతో రెండో స్థానంలో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ కొనసాగుతుండగా, 35 స్థానాలతో మూడో స్థానంలో బిలావల్ బుట్టో నేతృత్వంలోని పీపీపీ కొనసాగుతోంది.