పాకిస్థాన్ మరో ఉత్తర కొరియా కానుందా? అణ్వాయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందా? ఆసియాలో మరోసారి అణుపోటీకి తెరతీస్తోందా? ఉత్తర కొరియా, చైనాలను పాకిస్థాన్‌కు సహకారం అందిస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు అమెరికా రక్షణ రంగ నిపుణులు.
ఆసియాలో మరోసారి అణ్వాయుధ పోటీకి పాకిస్తాన్ తెరతీస్తోందని వారు ప్రకటించారు. ఒకేసారి తొమ్మిది కేంద్రాల్లో పాకిస్థాన్ అణ్వాయుధాల తయారీ చేస్తోందని అమెరికన్ సైంటిస్టులు వెల్లడించారు. ఇప్పటికే ఉగ్రవాదులకు స్థావరంగా మారిన పాకిస్థాన్.. మరిన్ని న్యూక్లియర్ వెపన్స్ రూపొందిస్తే పరిస్థితులు భయానకంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ అణ్వాయుధాలను మొత్తం తొమ్మది కేంద్రాల్లో తయారు చేస్తోందని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో పంజాబ్ ప్రావిన్స్‌లో 4, సింధ్ ప్రావిన్స్‌లో 3, బలూచిస్తాన్‌లో 2 కేంద్రాల్లో ఆయుధాలు రూపొందుతున్నాయని ఎఫ్‌ఏఎస్ ప్రకటించింది.