పాక్ రైలు ప్రమాదం: 65కి చేరిన మృతుల సంఖ్య

గురువారం, 31 అక్టోబరు 2019 (15:51 IST)
పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 65కి పెరిగింది. కరాచి - రావల్పిండి వెళుతున్న తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మూడు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. లియాకత్‌పూర్‌ నగర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 65 మంది మృతి చెందగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఘటనపై సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఆర్మీ సిబ్బంది మృతదేహాలను, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. 
 
రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన వద్దనున్న గ్యాస్ సిలెండర్‌ను వెలిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు