గాల్వాన్ లోయ దాడి ఘటన తర్వాత టిక్ టాక్‌తో పాటు.. 59 రకాల యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. అలాగే, అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదే బాటలో పయనించనుంది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతకు టిక్ టాక్ వల్ల ముప్పు వాటిల్లుతుందని పేర్కొంటూ ఈ చర్య తీసుకుంది.
కాగా, ఇప్పటికే, సింగపూర్‌కు చెందిన లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం బిగో యాప్‌నైతే ఏకంగా నిషేధించింది. వాటి వీడియోల్లోని అసాంఘిక, అశ్లీల, అసభ్యకర పోస్టులు ఉంటున్నాయని.. ఇవి సమాజంపై, ముఖ్యంగా యువతపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయని అక్కడి మానవ హక్కుల కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు.