పాకిస్థాన్‌ను, ముస్లింలను ఎందుకలా చూపిస్తున్నారు? సినీ నటి

శుక్రవారం, 16 ఆగస్టు 2019 (17:30 IST)
పాకిస్థాన్‌ను సినిమాల్లో ప్రతికూలం చూపుతున్నారని ఆ దేశ నటి మెవిష్ హయత్ వ్యాఖ్యానించింది. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలపై కూడా ఫైర్ అయ్యింది. హాలీవుడ్ లో ముస్లింల గురించి తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు చేసింది.


ఇంకా తాను ఎందుకు అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందో కూడా క్లారిటీ ఇచ్చేసింది. దుబాయ్‌లో జరిగిన ఫిలింఫేర్ ఈవెంట్ లో బాలీవుడ్ గురించి మాట్లాడానని ఆమె చెప్పుకొచ్చారు. 
 
ఐరాస వేదికగానూ తాను హాలీవుడ్‌లో ముస్లింలను చెడుగా చూపిస్తున్న తీరు ఇస్లాంఫోబియాకు దారి తీస్తోన్న వైనాన్ని ఎత్తిచూపుతూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మెవిష్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

ఈమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. బాజీ అనే సినిమాలో నటిస్తున్న మెవిష్.. ఇటీవల పాకిస్థాన్ సర్కారుచే తమ్ఘ-ఈ-ఇంతియాజ్అనే అవార్డుతో గౌరవించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు