ఇతడు పాక్ అణ్వాయుధం... ఇండియన్ గర్ల్స్ పైన ఈ #ChaiWala సర్జికల్ దాడులు చేస్తాడట...

బుధవారం, 19 అక్టోబరు 2016 (13:37 IST)
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో పాకిస్తాన్ ఇస్లామాబాదుకు చెందిన అర్షద్ ఖాన్ అనే నీలకళ్ల చాయ్‌వాలా ట్రెండ్ అవుతున్నాడు. అతడి ఫోటోను నెట్లో పెట్టిన పాక్ నెటిజన్లు... ఆ ఫోటో కింద కొన్ని వ్యాఖ్యలు జోడించారు. అందులో ఈ చాయ్ వాలా పాకిస్తాన్ అణ్వాయుధమనీ, ఇతడు పాకిస్థాన్‌లో భారత్‌ సర్జికల్‌ దాడులకు ప్రతీకారంగా భారతీయ అమ్మాయిలపై సర్జికల్‌ దాడులు చేస్తాడని పేర్కొన్నారు. 
 
ఇతడి దాడులతో ఇరుదేశాల మధ్య సమీకరణాలు సమానమైపోతాయంటూ వ్యాఖ్యానించారు. దీనితో ఈ ఫోటోను షేర్ చేస్తూ ఎవరిష్టం వచ్చినట్లు వారు కామెంట్లు చేస్తున్నారు. అటు పాకిస్తాన్, ఇటు ఇండియన్ నెటిజన్లు ఉత్సాహంగా #ChaiWalaపై సరదా కామెంట్లు చేస్తూ ఉండటంతో అతడిప్పుడు పాకిస్తాన్ దేశంలో సెలబ్రిటీగా మారిపోయాడు. అంతేకాదు.. కాఫీ వాలా కరణ్ జోహార్ కంటే తమ #ChaiWala బెటర్ అంటూ వారు పోస్టింగులు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి