ప్రేమ కోసం కొందరు విలువైన కానుకలు ఇస్తూ వుంటారు. మరికొందరు భార్య కోసం కానుకలు ఇస్తూ వుంటారు. చాలామంది నచ్చిన వ్యక్తులకు విలువైన గిఫ్ట్‌లు ఇవ్వడం చేస్తుంటారు. ప్రస్తుతం మనం మాట్లాడబోయేది రెండో రకానికి చెందిన వ్యక్తి గురించి. గతంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌కు గ్రహాలపై స్థలాలు కొనుగోలు చేయడం అంటే చాలా ఆసక్తి. 2018లో సుశాంత్ సింగ్ మారే ముస్కోవిన్స్ ప్రాంతంలో స్థలం కొనుగోలు చేశాడు. ఈ ఇన్స్పిరేషన్తో చాలామంది స్థలాలు కొనుగోలు చేశారు
తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఏకంగా ఎకరం స్థలం గిఫ్ట్‌గా ఇచ్చాడు. అదీ భూమిపై కొన్న స్థలం కాదు, చంద్రునిపై కొన్న స్థలం. చంద్రునిపై స్థలం కొనుగోలు చేయడం వలన ఉపయోగం లేకపోయినా.. భవిష్యత్తులో చంద్రునిపై మనుషులు ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.