పొరుగు దేశం పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. తన మాటను పెడచెవిన పెట్టి భార్య ఉద్యోగానికి వెళ్లడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేక పోయాడు. ఉద్యోగానికి వెళ్లొద్దు... ఇంటిపట్టునే ఉండమని పదేపదే చెప్పినా భార్య పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కసాయి భర్త.. కత్తితో తల నరికేశాడు. ఈ దారుణం పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్, రాయ్‌విండ్ అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
రాయ్‌విండ్ ప్రాంతంలో అఫ్రహీం, నస్రీన్ అనే దంపతులు ఉన్నారు. వీరిలో నస్రీన్ స్థానికంగా ఉండే ఓ కర్మాగారంలో పనిచేస్తోంది. అయితే, భార్య పని చేయడం అఫ్రహీంకు ఏమాత్రం ఇష్టంలేదు. దాంతో పలుమార్లు ఉద్యోగం మానేయాలంటూ చిత్రహింసలు పెట్టేవాడు.