మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన సోదరి పట్ల ఇద్దరు సోదరులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన పాకిస్థాన్ పంజాబ్ ముజఫర్‌ఘర్‌లో చోటుచేసుకుంది. సోదరి అని కూడా చూడకుండా కళ్ళు గుడ్లు పీకేసి, కాళ్ళు సరికారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళితే.. షరీఫాన్ బీబీ అనే 40 ఏళ్ల మహిళపై ఈ ఘోరం జరిగింది. సోదరుడి కుమార్తె కనిపించకపోవడంతో సోదరి తన బిడ్డను కిడ్నాప్ చేసిందని అనుమానించాడు. దీంతో బీబీ సోదరులు కలిసి ఆమెను కిడ్నాప్ చేశారు. ఆపై ఇద్దరు కలిసి ఓ పదునైన కత్తితో సోదరి రెండు కళ్ళ గుడ్లు పీకేశారు. అనంతరం ఆమె రెండు కాళ్ళు కూడా నరికేశారు. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పాక్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అయితే ఆ సోదరులను అరెస్ట్ చేయలేదు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని పోలీసులు అంటున్నారు.