పంజ్‌షేర్ వారియర్స్ పైన అల్‌ఖైదా తీవ్రవాదులతో కలిసి తాలిబన్లు దాడి

శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (22:08 IST)
ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తం దాదాపు చేతికి వచ్చినా పంజ్ షేర్ వ్యాలీ మాత్రం తాలిబన్లను తొక్కేస్తోంది. తాజాగా తమ పైకి దాడి చేయడానికి వచ్చిన 450 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్ షేర్ నార్తర్న్ అలయెన్సు ప్రకటించింది.
 
తమ వ్యాలీలో ఒక్క అంగుళం కూడా తాలిబన్లు వశం కాలేదనీ, తమ వద్దకు చేరుకోవడం వారి తరం కాదని పంజ్ షేర్ వ్యాలీ నార్తర్న్ అలియెన్స్ ప్రకటించింది. దీనితో తాలిబన్లు మరింత కుతకుతలాడుతున్నారు. ఎలాగైనా పంజ్ షేర్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని కొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
 
అల్ ఖైదా, పాకిస్తాన్ దేశానికి చెందిన ఐఎస్ఐ సాయం తీసుకుని పంజ్ షేర్ ఆట కట్టించాలని తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఇరు వర్గాల మధ్య భీకర పోరు సాగుతున్నట్లు సమాచారం. తాలిబన్లకు చెందిన ట్యాంకర్లను పంజ్ షేర్ వాసులు పేల్చేస్తున్న దృశ్యాలు నెట్లో చెక్కర్లు కొడుతున్నాయి. దీనితో తాలిబన్లు నిద్రాహారాలు మాని పంజ్ షేర్ పైన పట్టు కోసం యత్నిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు