అఫ్గానిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం: రెండు రోజుల్లో ప్రకటన

శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:47 IST)
తాలిబన్‌ అగ్రనేత ముల్లా హెబతుల్లా అఖూంజాదా పర్యవేక్షణలో అఫ్గానిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తమ ప్రభుత్వం ఏర్పాటుపై సంప్రదింపులు పూర్తయ్యాయని, క్యాబినెట్‌ కూర్పుపైనా చర్చ జరిగిందని తాలిబన్ల సమాచార కమిషన్‌ ఉన్నతాధికారి ముఫ్తీ ఇనాముల్లా సమంగానీ తెలిపారు. 
 
ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన వెలువడుతుందని తెలిపారు. ఇరాన్‌లో ఉన్న ప్రభుత్వ నిర్మాణం మాదిరిగానే అఫ్గాన్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. సమంగానీ చెప్పినదాన్ని బట్టి.. తాలిబన్‌ ప్రభుత్వంలో సుప్రీం లీడర్‌గా అత్యంత ఉన్నత స్థాయిలో అఖూంజాదా(60) ఉంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు