వివరాల్లోకి వెళితే... జేమ్స్ అట్కిన్సన్ అనే యువకుడు ఇంగ్లండ్‌లోని న్యూక్యాసిల్లో నివసించేవాడు. న్యూక్యాసిల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్‌లో నివాసం ఉండేవాడు. 2020 జులై 10న డడ్యాల్ అనే రెస్టారెంట్ నుంచి డెలివరూ యాప్ ద్వారా చికెన్ టిక్కా మసాలా పిజ్జాను ఆర్డర్ చేశాడు.
కాసేపటికే ఆర్డర్ డెలివరీ తీసుకున్నాడు. తినటం ప్రారంభించి.. రెండు ముక్కలు పూర్తి కాగానే అతడి పెదవులు, గొంతు వాచిపోయాయి. నొప్పితో బాధపడుతూ వెంటనే సహాయం కోసం ఎమర్జెన్సీ నంబర్ 999కి కాల్ చేశాడు. కొన్ని నిమిషాల్లోనే వైద్య సిబ్బంది జేమ్స్ ఇంటికి చేరుకున్నారు.