అత్యంత అరుదైన పింక్ డాల్ఫిన్ (వీడియో)

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (09:54 IST)
అత్యంత అరుదుగా కనిపించే పింక్ డాల్ఫిన్‌ ఒకటి అమెరికాలోని లూసియానా సముద్రజలాల్లో కనిపించింది. సోషల్ మీడియాలో ఈ పింక్ డాల్ఫిన్ ఇపుడు ట్రెండింగ్‌గా మారింది. 
 
సముద్రంలో అత్యంత అరుదుగా కనిపించే పింక్ డాల్పిన్ పింకీ అని స్థానికులు ముద్దుగా పిలిచే ఈ డాల్ఫిన్ వేగంగా వెళ్తున్న షిప్ ముందు సరదాగా దూకుతూ సందడి చేసింది. దీనిని మరో నౌకలో ప్రయాణించే వారు వీడియో తీశారు. 
 
ఈ వీడియోలో వేరే డాల్పిన్లతో కలసి సరదాగా వెళ్తున్న పింకీని చూడచ్చు. ఈ పింకీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. దీనిని నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ పింక్ దాల్ఫిన్స్ అరుదైనవని పరిశోధకులు చెబుతున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి