చైనా పర్వత ప్రాంతాల్లో కూలిన విమానం... 130 మంది దుర్మరణం

సోమవారం, 21 మార్చి 2022 (15:17 IST)
చైనాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సోమవారం పర్వత ప్రాంతాల్లో కుప్పకూలిపోయింది. దీంతో 130 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. నిర్ధేశిత సమయానికి గమ్యం చేరుకోవాల్సిన బోయింగ్ 737 విమానం పర్వత ప్రాంతాల్లో ప్రమాదానికి గురైనట్టు అధికారులు గుర్తించారు. 
 
ఈ విమానం గ్వాంగ్జూ రీజియన్‌లోని వుజుహ్ నగరం సమీపంలోని మారమూల పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలిపోయిన తర్వాత మంటలు చెలరేగాయని చైనా మీడియా సీసీటీవీ తెలిపింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకున్నట్టు తెలిపింది. 
 
మొత్తం 133 మందితో వెళుతున్న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం గ్వాంగ్జూ రీజియన్ వుజుహ్ నగరం సమీపంలోని టెంగ్ కౌంటీ వద్ద కూలిపోయింది. పర్వత ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి అని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు