ప్రిన్స్ చార్లెస్ విడాకులు.. సరిగ్గా ఏడాదికి కారు ప్రమాదంలో మృతి

శనివారం, 28 ఆగస్టు 2021 (13:50 IST)
ప్రిన్స్‌ చార్లెస్‌తో ఆమె వివాహం ఎంత చారిత్రాత్మకంగా నిలిచిందో.. అంతే మాదిరిగా ఆమె విడాకులు, మరణం కూడా నిలిచిపోయాయి. ప్రిన్స్‌ చార్లెస్‌ నుంచి డయానా 1996‌లో సరిగ్గా ఇదే రోజున విడాకులు తీసుకున్నారు. అనంతరం సరిగ్గా ఏడాదికి పారిస్‌లో ఒక కారు ప్రమాదంలో ఆమె విగతజీవిగా మారారు.
 
డయానా బ్రిటీష్‌లోని స్పెన్సర్‌ కుటుంబానికి చెందిన ఎడ్వర్డ్‌ జాన్‌ స్పెన్సర్‌, ఫ్రాన్సిస్‌ రూత్‌ రోచేల నాలుగో సంతానంతా 1961 జూలై 1న ఇంగ్లండ్‌లో జన్మించింది. 
 
స్పెన్సర్‌ కుటుంబానికి, బ్రిటీష్‌ రాజకుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. డయానా నాయనమ్మ, అమ్మమ్మలు బ్రిటీష్‌ మహారాణి ఎలిజెబెత్‌-1 వద్ద సహచరులుగా పనిచేశారు. 
 
1977లో ఆమె ప్రిన్స్‌ చార్లెస్‌ను చూసింది. అప్పుడామె వయసు 16 సంవత్సరాలు. ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగింది. మూడేండ్ల తర్వాత ఆమెను స్కాటిష్‌ భవనానికి తీసుకెళ్లి ఎలిజెబెత్‌ మహారాణికి, తండ్రి ఫిలిఫ్‌కు పరిచయం చేశాడు. 
 
చివరకు 1981 జూలై 29 న లండన్‌లోని సెయింట్‌ పాల్‌ కాతెడ్రాల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ప్రిన్స్‌ విలియం, ప్రిన్స్‌ హ్యారీలు జన్మించారు.
 
కెమిల్లా పార్కర్‌తో ప్రిన్స్‌ చార్లెస్‌కు సంబంధాలు బయటకు రావడంతో.. ప్రిన్సెస్‌ డయానా చార్లెస్‌ను దూరం పెడుతూ వచ్చింది. చార్లెస్‌తో విడాకులు తీసుకునేందుకు డయానా ససేమిరా అన్నప్పటికీ.. ఆమెను బలవంతంగా ఒప్పించారు. 
 
వీరి విడాకులు తీసుకుంటున్న విషయాన్ని అప్పటి బ్రిటన్‌ ప్రధానమంత్రి జాన్‌ మేజర్‌ 1992 డిసెంబర్‌ 9న ప్రకటించారు. చివరకు 1996లో వీరు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. దీని తర్వాత లండన్‌లో జరిగిన ఒక కారు ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు