బ్రిటన్ యువరాణి డయానాకు సంబంధించిన షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 1981లో ఆమెకు చార్లెస్‌కు వివాహం కాగా, 1997 ఆగస్టులో కారు ప్రమాదంలో చనిపోయింది. ఈమె మరణంపై ఇంకా మిస్టరీ వీడని నేపథ్యంలో.. తాజాగా ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. పెళ్లైన పది రోజుల్లోనే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది.
ఈ రికార్డులన్నీ డయానా స్నేహితురాలి సాయంతో ఇన్నాళ్లు భద్రంగా వున్నాయని.. అయితే ప్రస్తుతం బహిర్గతం అయ్యాయని బ్రిటన్ పత్రికలు వెల్లడించాయి. గతంలోనే డయానాపై మోర్టన్ అనే పుస్తకం వచ్చినప్పటికీ అందులో కేవలం స్నేహితులు మాత్రమే ఈ విషయం చెప్పినట్లు ఉండగా తాజాగా విడుదల చేస్తున్న పుస్తకంలో మాత్రం ఆత్మహత్యా ప్రయత్నం విషయాన్ని డయానేనే స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు.