శ్రీలంక అధ్యక్ష భవనంలో గుట్టలుగా కరెన్సీ నోట్ల కట్టలు

ఆదివారం, 10 జులై 2022 (13:16 IST)
శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆ దేశ అధ్యభ భవనాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. వీరంతా అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి లోపలి అన్ని ప్రాంతాలను కలియతిరిగారు. అపుడు వారికి కరెన్సీ నోట్ల కట్టలు గుట్టలుగా ఉండటాన్ని చూశారు. 
 
ఆ నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. నిరసనకారులు అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతకొడుతూ, వ్యాయాయం చేస్తూ సందడిగా కనిపించారు. మిలియన్ల కొద్దీ కరెన్సీ నోట్లను గుర్తించినట్టు స్థానిక మీడియా ఒకటి వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు సమాచారం. 
 
మరోవైపు, ఆందోళనకారుల దెబ్బకు అధ్యక్షుడు గొటాబయి రాజపక్సే అధ్యక్ష భవనం వీడి పారిపోయారు. ఆయన ఓడలో పారిపోయి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు