పబ్‌జికి ప్రేమ... చండీగఢ్‌కు అమెరికా అమ్మాయి.. పెళ్లి చేసుకున్నారు.. బస్సులో?

సెల్వి

బుధవారం, 19 జూన్ 2024 (18:27 IST)
అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసముంటున్న బ్రూక్లిన్ (30)కు ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతానికి చెందిన హిమాన్షు యాదవ్ అనే వ్యక్తి పబ్‌జి ఆడుతూ స్నేహం చేశాడు. వీరి పరిచయం స్నేహంగా మారి ప్రేమగా మారింది.
 
కొన్ని నెలల క్రితం, హిమాన్షుని కలవడానికి బ్రూక్లిన్ చండీగఢ్ వచ్చింది. హిమాన్షు ఆమెను కలుసుకున్నాడు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని కొన్ని రోజులు చండీగఢ్‌లో గడిపిన తర్వాత, హిమాన్షు బ్రూక్లిన్‌ని తన స్వస్థలమైన ఇటావాకు తీసుకువచ్చాడు.
 
ఇటావా నివాసితులు తమ గ్రామంలో ఒక విదేశీ మహిళను చూసి ఆశ్చర్యం కంటే ఎక్కువ అనుమానించారు. హిమాన్షు తనతో ఒక విదేశీ మహిళను బలవంతంగా తీసుకువెళుతున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
దంపతులు ఆర్టీసీ బస్సు ఎక్కడంతో కండక్టర్‌, డ్రైవర్‌కు కూడా అనుమానం వచ్చింది. దీంతో వారు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పరశురాం పాండేకు సమాచారం అందించారు. అతని ఆదేశాల మేరకు డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు.
 
యూపీ పోలీసులు బ్రూక్లిన్, హిమాన్షులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, బ్రూక్లిన్ హిమాన్షుతో వెళ్లేందుకు ఇష్టపూర్వకంగా అంగీకరించిందని, ఎలాంటి బలవంతం లేదని తేలింది. హిమాన్షుతో కలిసి ఢిల్లీ మీదుగా చండీగఢ్ వెళ్లేందుకు ఆ మహిళ తన పూర్తి సమ్మతిని తెలిపింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు