ఇంకోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మానసిక పరిస్థితి అంతగా బాగోలేదనీ, గత రెండేళ్లుగా కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో తన బంగ్లాకే పరిమితమైన పుతిన్ భిన్నంగా ఆలోచిస్తున్నారంటూ ఆంగ్ల పత్రిక డెయిలీ మెయిల్ పేర్కొంది. ఇదిలావుంటే తన మొదటి భార్య పిల్లల్ని, తన ప్రేయసితో పాటు ఆమె సంతానాన్ని అత్యంత కట్టుదిట్టమైన అణు బంకర్లకు పుతిన్ తరలించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఉక్రెయిన్ దేశానికి నాటో దేశాలు పరోక్షంగా సాయపడుతున్నాయంటూ రష్యా ఆరోపిస్తోంది. దీనితో ఉక్రెయిన్ పైన రష్యా చేస్తున్న యుద్ధం ఓ పట్టాన విజయం దిశగా సాగటంలేదు. దీనితో పుతిన్ తీవ్ర ఆగ్రహంతో వున్నారనీ, తన వద్దకు వచ్చేవారిపై కేకలు వేస్తున్నారంటూ ఆంగ్ల పత్రిక పేర్కొంది.