రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్‌కు రానుడండం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
అప్పుడు వెళ్లినప్పుడు ప్రధాని మోదీ పుతిన్‌ను భారత్‌కు రావాలని ఆహ్వానించారు. 2000లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాగా మొదటిసారిగా ఆయన భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత ఆరుసార్లు భారత్‌లో పర్యటించారు. అలాగే నాలుగు సార్లు ప్రధాని రష్యాలో పర్యటించారు.
కాగా.. భారత్- రష్యా మధ్య సంబంధాలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా ఈ సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరపడం, శాంతి ఒప్పందం వల్లే యుద్ధం ఆగుతుందని భారత్ ముందునుంచే చెబుతోంది.