మలేషియా ప్రధానితో రజినీకాంత్ భేటీ...

సోమవారం, 11 సెప్టెంబరు 2023 (18:03 IST)
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో సూపర్ స్టార్ రజినీకాంత్ సోమవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఈ జైలర్ ఉన్నారు. ఈ సందర్భంగా వారి భేటీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశఆరు. మలేషియా ప్రధానితో ఆయన కాసేపు ముచ్చటించారు. దీంతో ఈ విషయం ఇపుడు రాజకీయంగా చర్చనీయంగా మారింది.
 
తన ఎక్స్‌లో (ట్విటర్‌) ఈ ఫొటోలను షేర్‌ చేసిన అన్వర్‌ ఇబ్రహీం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రజినీకాంత్‌ను కలవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. 'ప్రజల కష్టాలు, ఆ కష్టాల సమయంలో నేను అందించిన సేవల పట్ల ఆయన గౌరవం ప్రదర్శించారు. అలాగే భవిష్యత్తులో ఆయన తీయనున్న సినిమాల్లో సామాజిక అంశాలు ఎక్కువగా ఉండేలా చూడాలని నేను కోరాను' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే రజనీకాంత్ ఎంచుకున్న ప్రతిరంగంలోనూ ఆయన రాణించాలని కోరుకుంటున్నట్లు అన్వర్‌ ఇబ్రహీం తెలిపారు. 
 
ఇక 2017లోనూ రజినీకాంత్‌ను అప్పటి మలేషియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ కలిసిన విషయం తెలిసిందే. దీంతో మలేషియా పర్యాటక శాఖకు రజనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ కానున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిపై స్పందించిన రజినీ.. 'కబాలి' షూటింగ్‌ ఎక్కువ భాగం మలేషియాలో జరిగిందని.. ఆ సమయంలో ప్రధానిని కలవడం కుదరకపోవడంతో ఇప్పుడు ఆయనను ఆహ్వానించినట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు