ఎలాంటి యుద్ధమైనా ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ఆ దేశానికి కొత్తగా నియమితులైన ఆర్మీ చీఫ్ ఇజాయెద్ అసిమ్ మునీర్ అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా సయ్యద్ అసిమ్ మునీర్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత్ వైపు కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.
పాకిస్థాన్ సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మా మాతృభూమిని రక్షించుకోవడానికి, శత్రువుపై పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నాం. మాపై యుద్ధానికి వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం... సయ్యద్ అసిమ్ మునీర్ అన్నారు. భారత్‌ను అవమానించేలా పాక్ ఆర్మీ చీఫ్ చేసిన ప్రసంగం వివాదానికి కారణమైంది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.