రష్యా రాయబారికి చుక్కలు.. ముఖంపై ఎర్ర పెయింట్ చల్లారు.. (వీడియో)

సోమవారం, 9 మే 2022 (19:33 IST)
Sergey Andreev
రష్యాపై ప్రపంచ దేశాలు గుర్రుగా వున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడులతో రష్యాపై ప్రజలు ఆవేశంతో రగిలిపోతారు. తాజాగా పోలాండ్‌లో యుద్ధ వ్యతిరేక నిరసనకారులు రష్యా రాయబారి సెర్గీ ఆండ్రీవ్‌పై ఎరుపు రంగు పెయింట్‌ను విసిరారు. 
 
రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన రెడ్ ఆర్మీ సైనికులకు వార్సా శ్మశానవాటికలో నివాళులు అర్పించకుండా ఆయనను అడ్డుకున్నారు. ఆయనపై ఎరుపు రంగు పెయింటింగ్ చల్లారు. ఇంకా ఉక్రెయిన్ జెండాలను పట్టుకుని ఆయన చుట్టూ గుంపుతో చుట్టుముట్టారు.
 
వార్సాలో సోవియట్ సైనికుల స్మశానవాటిక వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతున్న సమయంలో పోలాండ్‌ రష్యా రాయబారి సెర్గీ ఆండ్రీవ్, ఆయన వెంట ఉన్న రష్యా దౌత్యవేత్తలపై దాడి జరిగిందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా టెలిగ్రామ్‌లో తెలిపారు. 

The exact moment when Russian Ambassador Sergei Andreev was struck by red paint while trying to lay a wreath in the Soviet soldiers cemetery in #Warsaw#VictoryDay #9Mai #Putin #RussianUkrainianWar #StreetArt #Protest #Anonymous pic.twitter.com/D3u5QfCFtF

— I know (@rassegnista) May 9, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు