రష్యా బలగాల ఆధీనంలోకి ఉక్రెయిన్ రాజధాని కీవ్

శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (12:10 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధ శుక్రవారానికి రెండో రోజుకు చేరుకుంది. తొలి రోజు నలు వైపుల నుంచి బాంబుల వర్షం కురిపించిన రష్యా... రెండో రోజున మరింత భీకర దాడులకు తెగబడుతుంది. రెండో రోజున ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఈ రాజధాని ప్రాంతాన్ని రష్యా సేనలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
ఈ రాజధానిని చుట్టుముట్టిన రష్యా బలగాలు కీవ్‌కు వెళ్లే అన్ని రహదారులను దిగ్బంధించాయి. మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు మెరుపుదాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడుతుంది. ఇప్పటివరకు 83 స్థావరాలను ధ్వంస చేసినట్టు రష్యా అధికారికంగా ప్రకటించింది. 
 
మరోవైపు, రష్యా భీరక దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ బలగాలు, సైనిక సమీకరణకు ఆ దేశ అధ్యక్షుడు జలెన్‌స్కీ ఆదేశాలు జారీచేశారు. రానున్న 90 రోజుల పాటు ఇవి అమల్లోవుండనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు