అయితే, కింగ్ సల్మాన్ ''మసీదుల సంరక్షకుడు" అనే హోదాలో కొనసాగబోతున్నారని సమాచారం. సౌదీ యువరాజు పట్టాభిషేకంపై సౌదీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడక ముందే ఎంబీఎస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపినట్లు కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇటీవల సౌదీ అరేబియా రాజ కుటుంబంలో 11మంది యువరాజులతో పాటు మాజీ మంత్రులు, ఓ కోటీశ్వరుడిని సౌదీ అరేబియా ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ కుటుంబంలో రాజ్యమేలుతున్న అవినీతిని అంతమొందించేందుకే ఎంబీఎస్ అరెస్టుల వ్యూహ రచన చేశారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం కింగ్ సల్మాన్ తన కుమారుడు ఎంబీఎస్ సింహాసనాన్ని అప్పగించనున్నారని బ్రిటీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.