గల్ఫ్ దేశాల్లో నిబంధనలు ఎంత కఠినతరంగా వుంటాయి. ఇరాకీ సింగర్ మజిద్ ఆల్ ముహాన్ దిన్ ముహాన్ దిన్‌ను కౌగిలించుకున్న యువతికి రెండేళ్ల జైలు శిక్ష రూ.18 లక్షల జరిమానాను విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇరాకీ సింగర్ మజిద్ ఆల్ ముహాన్ దిన్‌కు గల్ఫ్ దేశాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో రియాద్‌లో రెండు రోజుల క్రితం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముహాన్ దిన్ అద్భుతంగా పాడారు.
ఈ కార్యక్రమానికి హాజరైన బురఖా ధరించిన ఓ యువతి ఆ పాటలను ఎంతో ఆస్వాదించింది. సంతోషం పట్టలేక వేదికపైకి వెళ్లి సింగర్ ముహాన్ దిన్ ని కౌగిలించుకుంది. అంతే అప్రమత్తమైన సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లి.. పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు సింగర్‌ను బలవంతంగా కౌగిలించుకుందనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆ యువతికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.18 లక్షల జరిమానాను కోర్టు విధించే అవకాశం వుందని తెలుస్తోంది.