పెద్ద నోట్ల వ్యవహారంతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో, ఏటీఎంల ముందు బ్యాంకుల ముందు ప్రజలు బారులు తీరుతున్న సంగతి తెలిసిందే. భారీ జనం ఏటీఎంలను బ్యాంకులను ఉపయోగించడం ద్వారా ఏటీఎంల కీ ప్యాడ్లపై బ్యాక్టీరియాతోపాటు వివిధ రకాల సూక్ష్మజీవులు ఉంటాయని న్యూయార్క్ పరిశోధకులు చెప్తున్నారు.
ఏటీఎంలను అనేకమంది ఉపయోగించడం ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల ప్రభావం అధికంగా ఉందని తద్వారా వ్యాధులు వస్తాయని హెచ్చరించారు. అందువల్ల జరజాగ్రత్తగా ఉండాలన్నారు. ఇలా కీ ప్యాడ్లపై ఉన్న పరాన్నజీవులు చెడిపోయిన ఆహార బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. అమెరికాలోని మన్ హట్టన్, క్వీన్స్, బ్రూక్లీన్ నగరాల్లోని 66 ఏటీఎం మెషీన్ల కీప్యాడ్లను పరిశీలించగా వీటిలో టెలివిజన్లు, విశ్రాంతి గదులు, వంటశాలలు, దిండ్లు, చేపలు, చికెన్, గృహ ఉపరితలాల నుంచి వెలువడిన సూక్ష్మజీవులు కనిపించాయని పరిశోధకులు తేల్చారు.
కొన్ని ఎటిఎం కీప్యాడ్లలో కుళ్లిపోయిన పాల ఉత్పత్తుల నుంచి వెలువడిన లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉందని పరిశోధనలో వెల్లడైందంని న్యూయార్క్ ప్రొఫెసర్ జానే కార్ల్టన్ వివరించారు. ఏటీఎం కీప్యాడ్లపై వివిధరకాల సూక్ష్మజీవులను గుర్తించామని న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జానే కార్ల్టన్ వెల్లడించారు.