కాగా, పాకిస్థాన్‌లో ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు విధించడంతో ఏర్పడిన రాజకీయ పరిణామాలు భారత్‌పై ప్రభావం చూపుతుంది. ఒకవేళ అక్కడి ప్రభుత్వం, మిలటరీ కనుసన్నల్లో పనిచేసేదైతే భద్రత పరమైన రక్షణను భారత్ కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది.
పాక్ మాజీ ప్రధాని షరీఫ్‌పై నరేంద్రమోదీకి నమ్మకం ఉండేది. కానీ పఠాన్‌కోట్, యూరీ ఘటనల తర్వాత ఆ నమ్మకం సన్నగిల్లింది. ఇలాంటి తరుణంలో పాకిస్థాన్ సర్కారు సైనిక ఆధిపత్యంలో ఉంటే మాత్రం సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాల్సి వుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.