చైనాలో కరోనా ఉగ్రరూపం.. వేలల్లో కొత్త కేసులు నమోదు

ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (09:35 IST)
కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో ఇపుడు కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ దేశంలోని వూహాన్ నగరంలో కరోనా పురుడు పోసుకున్న తర్వాత ఇంతటి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. శనివారం ఒక్క రోజే చైనా దేశ వ్యాప్తంగా ఏకంగా 24,326 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. షాంఘైలో 12 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. 
 
రాజధాని బీజింగ్‌లో 10 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. కరోనా కట్టడికి ఆ దేశం అవలంభిస్తున్న జీరో కోవిడ్ విధానం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఇదే విధాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగానే లాక్డౌన్‌తో పాటు కఠిన ఆంక్షలు విధించడంతో షాంఘైలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు